Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్‌రెడ్డి
యాలాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలన
నవతెలంగాణ-యాలాల
గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ భాదితులు ఇబ్బందులు పడకుండా ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆది వారం యాలాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను యాలాల ఎంపీపీ టి. భాలేశ్వర్ గుప్తాతో కలిసి పరిశీలించారు. విద్యాలయం భవనాన్ని ఐసోలేషన్ సెంటర్‌గా వాడుకోవాలని ఆయన అధికా రులను ఆదేశించారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చే యాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఒకే కుటుంబంలో ఇ ద్దరు ముగ్గురికి కోవిడ్ సోకి తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఇబ్బందులు తలెత్తకుండా భరోసా కల్పించాలన్నా రు. మండలాల్లో కూడా ఐసోలేషన్ సెంటర్లో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. బాధితులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్నాయక్, మండల విద్యాధికారి సుధాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ, పసుల రమేష్, నాయకులు, నర్సిరెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.