Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
లాక్డౌన్ నిబంధనలను వ్యాపారులు తప్పకుండా పాటించాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఉన్న కూరగాయల మార్కెట్‌ను మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్తో కలిసి పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సడలింపు సమయం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు వ్యాపారాలు నిర్వహించుకోవాలని తెలిపారు. వినియోగదారులు తమ వద్దకు వచ్చినప్పుడు భౌతికదూరం పాటించేలా, మాస్కు ధరించి ఉండేలా చూసుకోవాలని తెలిపారు. వ్యాపారస్తులు 10 గంటలకు పది నిమిషాల ముందే తమ వ్యాపారాలను బంద్‌చేయాలని కోరారు. వైద్యులు, పోలీసుల సూచనలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మురళీకష్ణ గౌడ్, మున్సిపల్ చైర్మన్ స్వప్న, వైస్ చైర్మన్ దీపా నర్సింహులు, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ చారి, నర్సిరెడ్డి(రాజు), రాజన్‌గౌడ్, సంతోష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.