Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చర్చించిన ప్రభుత్వ విప్ గాంధీ, సూపరింటెండెంట్ దశరథ్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
రంగారెడ్డి జిల్లా ఏరియా ఆస్పత్రి, కొండాపూర్ ఆస్పత్రిలో కొనసాగుతున్న కోవిడ్ చికిత్సపై సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ్‌తో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన అనంతరం ఆసుపత్రిలోని పరిస్థితులపై చర్చించినట్టు తెలిపారు. ప్రస్తుతం కరోనా చికిత్సకు 110 బెడ్స్ ఉన్నాయని, వీటిలో 70 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 108 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కలెక్టర్ ఆదేశాలతో 40 సిలిండర్లు అదనంగా ఏర్పాటు చేయడంతో, ఎమ్మెల్యే గాంధీ చొరవతో ఆక్సిజన్ కొరత తీరందని తెలిపారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా నిధుల సమీకరణలో సహకరించిన డాక్టర్ దశరథ్కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. కరోనా చికిత్సకుగాను ప్రత్యేకంగా తొమిది మంది డాక్టర్లు నిత్యం రొటీన్ పద్ధతిలో టర్మ్డ్యూటీ ద్వారా రోగులకు సేవలందిస్తున్నారని తెలిపారు. నాలుగు అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. గర్భిణులు, పిల్లల చికిత్సకు సంబంధించిన సేవలను, ఆస్పత్రిలో రోజువారీ అవుట్పేషంట్ సేవలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. కొందరు రాజకీయ నాయకులు ఆస్పత్రి ప్రాంగణాన్ని సందర్శించిన విషయాన్ని సూపరింటెండెంట్ ప్రభుత్వ విప్ దష్టికి తీసుకురాగా.. ఆస్పత్రిలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు.