Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
కరోనా కష్టకాలంలో స్వచ్ఛంద సంస్థలు, కంపెనీలు సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణ కేంద్రంలో గ్రీన్కో ఏఎంఆర్ కంపెనీ సహకారంతో ఎమ్మెల్యే ఐసోలేషన్ సెంటర్‌కు తొమ్మిది ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు. తాండూరులో మాతాశిశు సంక్షేమ ఆస్పత్రిలో కొనసాగుతున్న ఐసొలేషన్ సెంటర్‌కు తిమ్మిది ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించడం, రోగులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకష్ణ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, వైస్‌చైర్మన్ దీపానర్సింహులు, టీఆర్ఎస్ నాయకులు నర్సిరెడ్డి, శ్రీనివాసాచారి, నర్సింహులు, సంతోష్‌గౌడ్, జావిద్, ఇర్షాద్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.