Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలో అన్ని మౌలిక సదుపాయాలతో, రూ. 80 లక్షలతో నిర్మించిన రైతు బజార్‌ను ప్రభుత్వం వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రైతుబజార్‌ను ఆయన సందర్శించారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌తో కూరగాయల మార్కెట్‌ను బసవన్నకట్ట నుంచి కాలేజ్ గ్రౌండ్లోకి మార్చారని, అక్కడ రైతులు వ్యాపారం చేసుకుంటుంటే కొందరు దళారులు భయబ్రాంతులకు గుర్తి చేస్తున్నామని ఆరోపించారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. కూరగాయల వ్యాపారులకు బీజేపీ పూర్తిగా మద్దతు ఉంటుందన్నారు. రైతు బజార్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని కోరారు. విపత్కర పరిస్థితుల్లో ఓటు రాజకీయాలు మానుకోవాలన్నారు. అధికారులు కూడా ప్రజలకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్రకార్యవర్గ సభ్యురాలు కౌన్సిలర్ అంతారం లలితమ్మ, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, రజినీకాంత్, సుదర్శన్ గౌడ్, జగదీష్, అభిలాశ్ పండిత్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.