Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి
నవతెలంగాణ-ఆమనగల్
కరోనా వైరస్ బారినపడి మతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియాగా చెల్లించాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంగళవారం ఆమనగల్ ప్రభుత్వ ఆస్పత్రిలో జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి స్వరాజ్యలక్ష్మి తదితరులతో పాటు సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆచారి మాట్లాడుతూ కరోనా కాటుకు బలైనవారికి ఎక్స్ గ్రేషియా చెల్లించడంతో పాటు వైరస్ బారినపడి ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ నుంచి వైద్య ఖర్చులను అందజేయాలన్నారు. గతంలో 30 పడకలుగా మంచి పేరున్న ఆమనగల్ ప్రభుత్వ ఆస్పత్రి ప్రస్తుతం పది పడకలకే పరిమితమైందని తెలిపారు. ఎన్నికల సమయంలో స్థాయి పెంచుతామని సీఎం కేసీఆర్ హామీనిచ్చినా అమలు కావడం లేదన్నారు. రికార్డు ప్రకారం 63 మంది సిబ్బందికి 43 మంది మాత్రమే పనిచేస్తున్నారని, వీరిలో ముగ్గురు వైద్యులకు గాను ఒక్కరే విధులు నిర్వహించడంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదని వివరించారు. దీంతో రోగులు ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఆస్పత్రుల్లో ఉన్న ఎక్స్‌రే పరికరాలు పనిచేయడం లేదని, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడం శోచనీయమన్నారు. ఆసుపత్రి అభివద్ధి కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సంబంధిత జిల్లా అధికారులకు, సీఎంకు నివేదిస్తానని ఆచారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చందర్ రావు, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్, వైస్‌చైర్మన్ భీమనపల్లి దుర్గయ్య, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు కండె హరిప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోరటి నర్సింహ, కౌన్సిలర్లు చెక్కల లక్ష్మణ్, చెన్నకేశవులు, తల్లోజు విజరుకష్ణ, కష్ణ యాదవ్, విక్రమ్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు మేడిశెట్టి శ్రీధర్, మున్సిపాలిటీ కన్వీనర్ సుండూరి శేఖర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కండె సాయి తదితరులు పాల్గొన్నారు.