Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి
నవతెలంగాణ-పరిగి
పోలీసుల సేవలు మరువలేనివని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. మంగళవారం పరిగి పట్టణ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో ఆహారాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ పరిగి నియోజకవర్గ పరిధిలోని పరిగి, దోమ, కులక్కచర్ల, పూడూరు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఆహారం అందజేస్తున్నామని తెలిపారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేసేందుకు పోలీస్ సిబ్బంది తమ కుటుంబాన్ని వదిలి రోడ్లపై డ్యూటీ చేస్తున్నారని అన్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఎవరూ రోడ్లపైకి రాకుండా ఇంట్లోనే ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు. ఉదయం బయటికి వెళ్లేప్పుడు మాస్కులు ధరించి, శానిటైజర్లు తీసుకువెళ్లాలని సూచించారు. భౌతికదూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి సీఐ లక్ష్మిరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్‌రెడ్డి, ఎస్ఐలు క్రాంతి కుమార్, రమేష్, పోలీస్ సిబ్బంది, నాయకులు గోపాల్ పాల్గొన్నారు.