Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి
నవతెలంగాణ-ఫరూఖ్‌నగర్
పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదు వేల మందికి కరోనా నివారణ మందులను ఉచితంగా అందిస్తామని పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. తనతో పాటు తమ కుటుంబ సబ్యులు కరోనా వైరస్ బారిన పడ్డారని, కరోనా నుంచి తామంతా కోలుకుంటే వెయ్యి మంది కరోనా భాదితులకు సాయం చేస్తానని అప్పుడే సంకల్పించుకున్నానన్నారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా బాధితులకు ఇచ్చే మందులను స్టడీ చేసి, కొనుగోలు చేసి 20 రోజులుగా మందుల కిట్లను నియోజకవర్గంలోని కరోనా బాధితులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తర్వాత ఫోన్ ద్వారా వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టు వివరించారు. త్వరలోనే నిరుద్యోగులకు వత్తి విద్యా కోర్సుల్లో శిక్షణా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కొందరు తాము పంపిణీ చేస్తున్న మందులపై ఫిర్యాదు చేశారని, మంచి పనులను అడ్డుకోవడం తగదని సూచించారు. కరోనా బాధితులను కాపాడటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ నేత వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపించారు.కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్చాలం మురళీ, ఆకుల ప్రదీప్, ఋషికేశ్, వంశీకష్ణ పాల్గొన్నారు.