Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు సూచనలు చేసిన అదనపు కలెక్టర్ తిరుపతిరావు
నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ మండల కేంద్రంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ ఎస్ తిరుపతి రావు డీసీసీబీ డైరెక్టర్, ఆమనగల్, కడ్తాల్ మండలాల పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తాతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు వివరాలను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతుల కోరిక మేరకు కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ధాన్యం నిల్వలకు తగ్గట్టుగా గన్నీ బ్యాగులను సమకూర్చాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కొనుగోళ్లలో ఎలాంటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని పలు సూచనలు చేశారు. పర్యటనలో భాగంగా కలెక్టర్ తిరుపతిరావు స్థానికంగా ఉన్న పారాబాయిల్డ్ రైస్ మిల్లును సందర్శించారు. ప్రస్తుత సీజన్లో వస్తున్న అదనపు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.