Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వేరోసర్కిల్ జిల్లా అధ్యక్షులు లింగం
నవతెలంగాణ-కేశంపేట
విద్యార్థులంతా క్రమశిక్షణ కలిగి ఉండి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని రంగారెడ్డి జిల్లా స్వేరో సర్కిల్ అధ్యక్షులు పీ లింగం అన్నారు. స్వేరోస్ విక్టరీ డే సందర్భంగా మంగళవారం కేశంపేట మండలం కాకునూరు గ్రామ స్వేరో సర్కిల్ ఆధ్వర్యంలో కాకునూరు గ్రామం నుండి కొండారెడ్డిపల్లి గ్రామం వరకు ఐదు కిలోమీటర్లు కాలినడక వెళ్లారు. అక్కడ ఉన్న గుట్టపైకి ఎక్కి విక్టరీ డే వేడుకలను నిర్వహించుకున్నారు. విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. విద్యార్థులను ఉద్దేశించి లింగం మాట్లాడుతూ ఆట, పాటలతోపాటు చదువులో రాణించాలన్నారు. మారుమూల గ్రామంలో జన్మించిన గురుకుల విద్యార్థులు మాలావత్ పూర్ణ, ఆనంద్ అతిచిన్న వయసులో ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కి ప్రపంచ రికార్డు సాధించారని తెలిపారు. ఈ శుభపరిణామాన్ని యావత్ ప్రపంచానికి గుర్తు చేయడం కోసమే స్వేరోస్ విక్టరీ డేను నిర్వహిస్తామన్నారు. వారి విజయం వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్, ఉపాధ్యాయ బందం కషి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చందన, వైష్ణవి, రక్షిత, హార్థిక, అర్చన, దీవెన, సన్నీ, యశ్వంత్, శివమణి, శివ, వంశీ పాల్గొన్నారు.