Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస చంద్రయ్య
నవతెలంగాణ-కొడంగల్
గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస చంద్రయ్య డిమాం డ్ చేశారు. గ్రామపంచాయతీ వర్కర్లకు వేతనాలు పెంచాలని సీఐటీయూ ఆధ్వర్యంలో దౌల్తాబాద్ ఎంపీవోకు శనివారం మెమోరండం అందించారు, ఈ సందర్భంగా బుస చంద్రయ్య మాట్లాడుతూ వివిధ శాఖలలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులతోపాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, ఉద్యోగులు, కార్మికులకు, క్యాజువల్ లేబర్, హౌంగార్డులకు, అంగన్వాడీ టీచర్లకు వేతనాలు పెంచారన్నారు, గ్రామ పంచాయతీలో పనిచే స్తున్న సిబ్బంది పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు, రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు పెంచాలన్నారు. పెరి గిన ధరలను దృష్టిలో పెట్టుకొని వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భీమప్ప, అంజయ్య, రాఘవేందర్, లక్ష్మీనారాయణ, గోవిందు, రమేష్, వెం కటేష్, శంకర్, సాయప్ప తదితరులు పాల్గొన్నారు.