Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దుబ్బాక రాంచందర్
- పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో రాస్తారోకో
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ప్రజలను దో చుకోవడంలో మోడీ ప్రభుత్వం నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దుబ్బాక రాంచం దర్ అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్‌చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఇబ్రహీంట్నంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశన్నంటుతున్నా యన్నారు. మోడీ ప్రభుత్వం ఎందుకు మేల్కొవడం లేదని ప్రశ్నించారు. లీటరు పెట్రోల్ సెంచరీ దాటిందని ఆందో ళన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు ఎలా జీవిస్తారని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవా ల్సిన ప్రభుత్వాలు ధరలు, పన్నుల మోతలో పోటీ పడుతు న్నాయని విమర్శించారు. విపరీతంగా ఇంధన ధరలు, ప న్నులు పెంచడం వలన రవాణా, ఆటో మొబైల్స్, వ్యవసా యం, రిటైల్ నుంచి వస్త్రాల వరకు అనేక రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. కరోనా మహమ్మారి, ఆదాయం, ఆరోగ్యం, ఉద్యోగ నష్టాల కారణంగా బాధపడుతున్న సామాన్యుల కొనుగోలు శక్తి కూడా పాతాళానికి తాకిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి వర్గాల ఎదుర్కొంటున్న ఇబ్బందు లను పట్టించుకోకుండా ప్రజా వ్యతరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో పతనం చేయకతప్పదన్నారు. ప్రధాని మోడీ తన నియంతృత్వ పోకడలతో అరాచకంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తూ రాక్ష స పాలన కొనసాగిస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నా రు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై భారాలు మోపడంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్ కమిటీ సభ్యులు సామేల్, జిల్లా కమిటీ సభ్యులు జగన్, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి గణేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శంకర్, కేవీపీఎస్ నాయకులు ప్రకాష్‌కారత్, జ్యోతిబసు, సురేందర్, సీహెచ్ వినోద్, ప్రభు, వీరేశ తదితరులున్నారు.