Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన
నవతెలంగాణ-పరిగి
పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు తగ్గించాలని అఖిల భారత కమిటీల పిలుపు మేరకు శనివారం సీపీఐ(ఎం), సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో పరిగి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం వెంకటయ్య, సిపిఐ నాయకులు పీర్ మహిముద్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పెట్రోల్, డీజిల్ ధరలు గ్యాస్, నిత్యావసర ధరలు పెంచి, దేశంలో ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలపై పరోక్ష పన్నుల ద్వారా మూడు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం ప్రజల నుంచి దోచుకుని, కార్పొరేటు అయినటువంటి అంబానీ,అదానికి మరియు కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తు కార్పొరేట్లకు సేవలు చేస్తూ, పేద, మధ్యతరగతి ప్రజలు దేశంలో బతకడానికి కనీసం భరోసా ఇవ్వడం లేదన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల అత్యవసర సరుకులు 30 శాతం పెరగడం వాళ్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరోనా నివారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కనీసం ఆక్సిజన్ అందించకపోవడం వల్ల అనేక మంది మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా థర్డ్‌వేవ్ కంటే ముందే దేశంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు హబీబ్, శ్రీనివాస్, బసిరెడ్డి, రవి, ప్రభు, షేఫీ, అశోక్, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.