Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్ (గచ్చిబౌలి)
లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మోహర్ కాలనీ లో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ శేరిలింగంపల్లి శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీణ 320 ఉశ్+జుచీ జశీఅషవఅ్తీa్శీతీర దీaఅసను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వారు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు అని తెలిపారు. సామాజిక దక్పథంతో సేవ చేయడానికి ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ వారి ఔదార్యం ఎంతో గొప్పదని,లయన్స్ క్లబ్ వారు సేవ దక్పథంతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం చాలా అభినదించదగ్గ విషయమన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ అవసరమగు రోగులకు ఈ పరికరాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ప్రతి ఒక్కరు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవత దక్పథంతో ఎదో తోచిన విధంగా తమ వంతు సహాయం చేయడానికి ఇతరులు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ వారిని గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ూజ×ఖీఏరియా లీడర్ లయన్ బాబూరావు, డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ సూర్యారాజు, రామకృష్ణ రెడ్డి డిస్ట్రిక్ట్ గవర్నర్ (ఎలెక్టెడ్), శ్రీనివాస్ ఫస్ట్ వైస్ గవర్నర్ (ఎలెక్టెడ్),శేరిలింగంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సుబ్బారావు, లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రతినిధులు మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, హౌప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండా విజరు , గచ్చిబౌలి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు రాజ్ నాయక్, చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, అన్వర్ షరీఫ్, ప్రతాప్ రెడ్డి యాదగిరి గౌడ్, జనార్దన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, చెన్నం రాజు, కరుణాకర్ గౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, సురేందర్, ఖాసీం, మల్లేష్ వినోద్, యాదగిరి, రామేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.