Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్ యాదవ్
- కడ్తాల్ మండలంలోని పలు గ్రామాల్లో వాటర్ ట్యాంకులు ప్రారంభించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-ఆమనగల్
ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీటిని అందించా లనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్ యాదవ్ అన్నారు. శనివారం కడ్తాల్ మండలంలోని గుర్లకుంట తాండా, టాకురాజు గూడ, రావిచేడ్, న్యామతాపూర్, నాగిరెడ్డిగూడ, మక్త మాధా రం, రేఖ్య తాండా, సాలార్‌పూర్, చల్లంపల్లి, వంపు గుడ తదితర గ్రామాల్లో తాగునీటి కోసం ఏ ర్పాటు చేసిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కు తుందన్నారు. కార్యక్రమంలో భాగంగా కడ్తాల్ మం డలంలోని పోచమ్మగడ్డ తాండాకు చెందిన దేవికి రూ.48,000లు, మర్రిపల్లి గ్రామానికి చెందిన దేవకమ్మకు రూ.56,000ల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ గ్రామీణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్, ఆమనగల్ కడ్తాల్ మం డలాల పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తా, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు జోగు వీరయ్య, సర్పంచ్‌లు గూడూరు లక్ష్మీ నరసింహరెడ్డి, హరిచంద్ నాయక్, భారతమ్మ విఠలయ్య, సులోచన సాయిలు, రవీందర్‌రెడ్డి, కృష్ణయ్య, శంకర్ నాయక్, ఎంపీటీసీలు బొప్పిడి గోపాల్, మంజుల చంద్రమౌళి, లచ్చిరామ్ నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, ఉపసర్పంచ్లు వెంకటేష్, రేణుక యాదగిరి, శ్రీశైలం, గణేష్, జైపాల్‌రెడ్డి, స్థానిక వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.