Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వీనర్ రాజుకుమార్
- సెక్యూరిటీ సిబ్బందికి ఫేస్‌షీల్డ్ పంపిణీ
నవతెలంగాణ-తాండూరు
కరోనా సమయంలో తాండూరు జిల్లా ఆస్పత్రి వైద్యు లు, సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని తాం డూరు నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ రాజుకుమార్ అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలోని ప్ర భుత్వ ఆస్పత్రిలో సిబ్బందికి, 40 మంది సెక్యూరిటి సి బ్బందికి ఫేస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజ్‌కు మార్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది సేవలను కొనియా డారు. జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేయకపో వడం బాధాకరం అన్నారు. మెడికల్ కాలేజీ కోసం స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ జయప్రసాద్ మాట్లాడుతూ.. బీసీ సం ఘం, జనచైతన్య యువజన సంఘం సెక్యూరిటీ సిబ్బం దికి ముఖ కవచాలు పంపిణీ చేయడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ షుకూర్, జన చైతన్య యువజన సంఘం నాయకులు జుంటుపల్లి వెంకట్, బీసీ నాయకులు గడ్డం వెంకటేష్, ఆస్పత్రి సూపర్వైజర్ రాఘవేందర్, అఖిల్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.