Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఫరూఖ్‌నగర్
షాద్‌నగర్ పట్టణంలోని సిండికేట్ కాలనీలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు కరోనాతో ఉపాధి అవకాశాలు తగ్గి సతమతమవుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం దారుణమన్నారు. వ్యవసాయ సంబంధిత మందులపై, విత్తనాలపై, భారం మోపడంతో సామాన్యరైతు సతమతం అవుతున్నాడని తెలిపారు. సీఎం కేసీఆర్ రైతు పండించిన ప్రతి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీలిచ్చినా గన్ని బ్యాగుల కోసం కుస్తీలు పట్టే పరిస్థితి నెలకొందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరికి పెన్షన్లు, రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ హయాంలోని సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, అంజయ్య, రాయికల్ ఎంపీటీసీ వెంకటరెడ్డి, ఆశన్న గౌడ్, హాజిపల్లి దర్శన్, వెంకటేష్, శ్రీశైలం ఎంపీటీసీ, మాధవులు, నవీన్, పుల్లారెడ్డి, ప్రవీణ్, వంశీ, అందే మోహన్, ఖదీర్, ముబారక్ ఖాన్, అందే శ్రీకాంత, ప్రదీప్, రాజు, అనిల్, తదితరులు పాల్గొన్నారు.