Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి
నవతెలంగాణ-కుల్కచర్ల
ప్రతీ కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం చౌడాపూర్ మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు ముదిరాజ్, బ్లాక్ 2 అధ్యక్షుడు కర్రే భరత్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాసయ్య ముదిరాజ్, మాజీ ఎంపీపీ అంజిలయ్య గౌడ్, రవిశంకర్ , మాజీ సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.