Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుల్కచర్ల
చాపలగూడెం గ్రామంలో కరోనాతో మృతి చెందిన కుటుంబానికి శనివారం నిత్యావసర సరుకులు చైల్డ్‌లైన్ సంస్థ ఆధ్వర్యంలో అందజే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపత్కాలంలో చైల్డ్ లైన్ -1098 సంస్థ ఆధ్వర్యంలో కరోనా బారినపడిన కుటుంబాలకు నెలకు సరిపడే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని సర్పంచ్ లక్ష్మణ్ అన్నారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు. కరోనా కట్టడికి అందరూ కృషి చేయాలన్నారు. శిశు సంక్షేమ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 040-23733665 ఫోన్ నెంబర్‌కు కాల్ చేస్తే తగిన సహాయం అందజేస్తామని చైల్డ్‌లైన్ ప్రతినిధి రామచంద్రయ్య ఈ సందర్భంగా తెలిపారు. బాధితుల వివరాలు తమ దృష్టికి తీసుకురా వాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ వెంకటయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి రవి, అంగన్వాడీ టీచర్ వీరమణి, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.