Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి అన్నింటికీ సడలింపులు
- కరోనా నిబంధనలు పాటించాలిందే అంటున్న ప్రభుత్వం
- జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం
- రాష్ట్ర క్యాబినెట్లో కీలక నిర్ణయాలు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
నెల రోజులుగా రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ, లాక్డౌన్ విధిం చింది. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో శనివారం సమావేశమైన మంత్రి వర్గం ఎట్టకేలకు లాక్డౌన్ ఎత్తివేతపై నిర్ణయం తీసుకుంది. కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని వైద్యశాఖ అధికారులు నివేదికలను అందించారు. దీంతో లాక్డౌన్ను ఎత్తివేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. తెలంగాణలో ఇతర రాష్ట్రాల కంటే వేగంగా కరోనా నియంత్రణలోకి వచ్చిందని అధికారులు నివేదికలు అందించారు. కరోనా తీవ్రత తగ్గుముఖం, లాక్డౌన్ ఎత్తివేతతో అన్ని కేటగిరీల వి ద్యా సంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం విద్యాశాఖను ఆదేశించింది. ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ఈ తీసుకుందని క్యాబినెట్ ప్రకటించింది. దీనికి ప్రజల సహకారం కావాలని ప్రభుత్వం కోరింది. లాక్డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని తప్పనిసారిగా నిబంధనలు పాటించాలని సూచించింది. మాస్క్ ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం.. తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని చెప్పింది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని స్పష్టం చేసింది.