Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనస్తాపంతో గడ్డి మందు తాగిన బాధితుడు చికిత్స పొందుతూ మృతి
- న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన
- పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
నవతెలంగాణ-మొయినాబాద్
రెండు చేపల దొంగిలించినందుకు నిండు ప్రాణం బలైంది. చేపలు పట్టుకున్నడని యువకుడిపై దాడి చేశారు. దీంతో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని హేతుబార్పల్లి గ్రామంలో చోటుచే సుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో మల్లని శ్రీకాంత్ (21 ) చదువు పూర్తియై ప్రస్తుతం ఇంటిదగ్గర ఉంటున్నాడు. వారం క్రితం మంగళవారం సాయంత్రం పక్క గ్రామం నక్క పల్లికి చెందిన అంకమ్మ కుంటలో చేపలు ఉండటంతో అక్కడికి వెళ్లాడు. రెండు చేపలు పట్టుకోవడంతో గమనించిన బంటు మల్లేష్, వడ్డే శివకుమార్‌లు మల్లని శ్రీకాంత్‌ని పట్టుకొని తీవ్రంగా పిడిగుద్దులతో ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. మనస్తాపానికి యువకుడు గడ్డి మందు తాగాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలు అయిన చోట రక్త ప్రసరణ సరిగా సాగక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు.
బంధువులు, బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన
తమ కుటుంబ సభ్యుడు చనిపోవడంతో శ్రీకాంత్ బంధువులు, బాధిత కుటుంబ సభ్యులు నక్కపల్లి గ్రామంలో ఆందోళనకు దిగారు. రో డ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం రెండు చేపలు పట్టుకున్న దళిత యువకుడిపై దాడి చేయడం సరికాదన్నారు. దొంగతనం చేస్తే పోలీసుస్టేషన్ ఫిర్యాదు చేసి, నష్టపరిహారం తీసుకోవాలని కానీ ఇలా ఇష్టానుసారంగా దాడి చేసి ప్రాణాలు తీయడం బాధాకరం అన్నారు. తాము ఏం చేసిన చెల్లుతుందనే కారణంతో ఆగ్ర కులాల వారు దళితులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని హేతుబర్ పల్లి గ్రామస్తుడు ప్రభాకర్ డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే విషయ తెలుసుకున్న ఏసీపీ సంజరు కుమార్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇరు గ్రామస్తుల మధ్య ఘర్షణలు తలెత ్తకుండా పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. బాధితులు న్యాయం కోసం ఆందోళన చేపట్టడంతో ఇరు గ్రామాల సర్పంచ్ల భర్తలు బాధిత కుటుంబానికి ఆర్థిక పరంగా న్యాయం చేరేందుకు చర్చలు జరిపారు. శ్రీకాంత్ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే తల్లిదండ్రులకు శ్రీకాంత్ ఒక్కడే కావడంతో శ్రీకాంత్ తల్లీతండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.