Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ అధికారులకు జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి ఆదేశం
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
రైతులకు ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా కొనుగోళ్లు జరుపాలని జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి అధికారులకు ఆదేశించారు. సోమవారం జడ్పీ కార్యాలయంలో వ్యవసాయ, వాటి అనుబంధ శాఖల జిల్లాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఎక్కడ కూడా రైతాంగం ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులకు ఆధునిక సాగుపై చైతన్య పరచాలని సూచించారు. పంటల సాగు, మందుల వాడకంపై కూడా అవగాహన నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ జానకిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, డీఆర్డీఓ క్రిష్ణన్, జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా కో అపరేటివ్, మెర్కెటింగ్ అధికారి పాల్గొన్నారు.