Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్
- కడ్తాల్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-ఆమనగల్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటుందని కల్వకు ర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్ అన్నారు. సోమవా రం కడ్తాల్ మండల తహసీల్దార్ కార్యాలయం ఆవర ణలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిరుపేద కు టుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి వర్గ విభేదా లకు అతీతంగా యువతుల వివాహాలకు లక్ష రూపా యలు అందజేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 36 మంది లబ్దిదారులకు చెక్కులు అందజేసినట్టు తహసీల్దార్ మహేందర్ రెడ్డి తెలిపారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
కార్యక్రమంలో భాగంగా కడ్తాల్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలకు చెందిన పలువు రు లబ్దిదారులకు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన లక్ష్మారెడ్డికి రూ.56,000లు, చల్లంపల్లి గ్రామానికి చెందిన కవితకు రూ.20,000లు, చరికొండకు చెందిన రమేష్‌కు రూ.18,000లు, పద్మకు రూ.25,000లు మైసిగండికి చెందిన గాంస్యకు రూ.26, 000ల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. అంతకు ముందు కడ్తాల్ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పిప్పళ్ళ వెంకటేష్‌కు చెందిన నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో జిల్లా పరిషత్ గ్రామీణాభివృద్ధి శాఖ స్టాం డింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ జెడ్పీటీసీ జర్పుల ద శరథ్ నాయక్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీసీసీ బీ డైరెక్టర్, ఆమనగల్ కడ్తాల్ మండలాల పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, రేఖ్యా తాండా సర్పంచ్ హరిచంద్ నాయక్, మైసిగండి సర్పంచ్ తులసిరామ్ నాయక్, సర్పంచ్‌లు భారతమ్మ నర్సింహ, భాగ్యమ్మ జంగయ్య, శంకర్, కృష్ణయ్య, ఎంపీటీసీలు గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, లచ్చిరామ్ నాయక్, కో-ఆప్షన్ సభ్యులు జహాంగీర్ బాబా, స్థానిక నాయకులు పాల్గొన్నారు.