Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కొడంగల్
కొడంగల్ మున్సిపల్లోని రెండో వార్డులో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆదేశానుసారం సూపరింటెండెంట్ ఇంజనీర్ రమణమూర్తి డ్రయినేజీ పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రయినేజీ పనులు నిర్వహిస్తున్న వార్డుల్లో అనుకున్న దానికి భిన్నంగా ఉండటంతో మెటీరియల్ అవసరం మారడంతో పనులు జరుగుతున్న ప్రదేశాలను పరిశీలించి దానికనుగుణంగా పనులు చేపడుతున్నట్టు తెలిపారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు తెలిపామన్నారు. పది రోజుల క్రితం ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులతో సమావేశం నిర్వహించగా డ్రయినేజీ పనులను ఎమ్మెల్యేకు రెండు నెలల కాలంలో పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ మేరకు పనులు జరుగుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ ప్రభాకర్‌రెడ్డి, డీఈ సాజిద్, కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.