Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
నకిలీ విత్తనాలు మందులు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ అన్నారు. పరిగి మండలంలో నకిలీ విత్తనాలు నిషేధిత మందులను విచ్చలవిడిగా అమ్ముతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ విద్యాసాగర్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలతో రైతులు నిత్యం నష్టపోతున్నారని అన్నారు. పరిగి మండలంలో వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా అమ్ముతున్నారని అన్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పరిగి మండల అధ్యక్షుడు మల్లేష్, మండల నాయకులు నర్సింలు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.