Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్, వ్యకాస నాయకులు
- కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
ఉపాధి హామీ పనులు, బిల్లుల చెల్లింపులో కులా ల వారీగా విభజన, కేంద్ర బడ్జెట్లో దళితులు, గిరిజ నుల అభివృద్ధికి కేటాయించిన సబ్‌ప్లాన్ నిధులను గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉపాధి హామీ పనుల కు దారి మళ్లిస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం తక్షణం ఉపసంహరించుకోవాలని కేవీపీఎస్, వ్యకాస నాయకులు డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలు అయినా ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు వరి ధాన్యం కొనుగోలు పేరుతోనే రైతుల నుంచి దోపిడీ చేయడాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ నేడు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మైపాల్ మాట్లాడుతూ.. ఉపాధి కూలీలను వర్గాలుగా, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగలుగా విభజన చేసి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫండ్ బదిలీ ఉ త్తర్వులు తీసుకువచ్చిందని తెలిపారు. ఈ ఉత్తర్వులను వెంటనే ఉప సంహరించుకో వాలని ప్రజా సంఘాలు దేశవ్యాపిత పిలుపునిచ్చాయి. ఓకే వేతనానికి అర్హమైన కార్మికులను వివిధ కుల, వర్గాలుగా విభజించటానికి ఎటువంటి హేతుబద్దత లేదన్నారు. ఇది చట్ట విరుద్ధం అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని భంగ పరుస్తుంతుందని విమర్శించారు. ఇది వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యాన్ని సృష్టిస్తుందన్నారు. ఏడాదిలో 200రోజుల పనిదినాలు, రోజుకు రూ.600 ఇవ్వాలన్నారు. కొడం గల్ మండలం నందిగామ గ్రామంలో వరి కొనుగోలు చేస్తే ఐకేపీ నిర్వాహకులు రైతుల నుంచి ట్రాన్స్‌ఫోర్టు కిరాయి అదనంగా 12 రూపాయలు తీసుకుంటూ, ధాన్యం దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్ర మంలో సహకార సంఘం, కేవీపీఎస్ నాయకులు లాలూ, చంద్రయ్య, రవి, వెంకటయ్య, రవి, అనంత య్య, లాలయ్య, అంజయ్య, భీమయ్య, నర్సింలు, జాంగిర్, లాలూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.