Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఉప్పలి మల్కయ్య
నవతెలంగాణ- యాలాల
మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన బలహీన వర్గాలకు చెందిన రా సూరి శ్రీనివాస్ పట్టా భూమిని ఆర బిఎల్ యాజమాన్యం ఆక్రమించుకుందని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉప్పలి మల్కయ్య ఆరోపిం చారు. సోమవారం ఆ భూమిని సందర్శించారు. అనం తరం యాలాల తహసీల్దార్ గోవిందమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొంత పట్టా భూమి 215, 216, సర్వే నంబర్లలో గల విస్తీర్ణం 4:32 గుంటల భూమిలో 32 గుంటలు అక్రమంగా ఆక్రమించుకున్నారని అన్నారు. కంచె కూడా ఏర్పాటు చేశారన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ కింద నిర్మించిన రూ.5 లక్షల చెక్ డాంను పూర్తిగా ధ్వంసం చేసి ప్రభుత్వం ఆస్తిని నష్ట పరిచారని ఆయన తెలియజేశారు. ఆర్బి ఎల్ కంపెనీ వలన చుట్టు పక్కల రైతుల పొలాలకు కలుషితంతో కూడిన నీరు వదలడం వలన రైతులు పొలాలు పూర్తిగా పాడౌతున్నాయని పేర్కొన్నారు. ఇట్టి విషయాన్ని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే ఆర్బిఎల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆక్రమించుకున్న భూమిని తిరిగి శ్రీనివాస్‌కు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు రవి కుమార్, రాజేందర్, లాలూ, నరసింహులు, లక్ష్మణ్ నాయక్, మల్లేష్, తదితరులు ఉన్నారు.