Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్సీలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం
- 50శాతానికి మించి పెంచకుండా 30శాతం ఎలా పెంచడం సరికాదు
- 87 లక్షల ఉద్యోగుల పట్ల ప్రభుత్వ చిన్నచూపు
- కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షులు జె.వెంకటేష్
- జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా
- జిల్లా కలెక్టర్కు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని, పీఆర్సీని సవరించి తమను న్యాయం చేయాలని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న వివక్ష ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారని తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్టు, ఔట్సో ర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జె.వెం కటేష్ ప్రశ్నించారు. పీఆర్సీలో కాంట్రాక్టు, ఔట్సోర్సిం గ్ ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆం దోళన వ్యక్తం చేశారు. వారి సమస్యలు పరిష్కరించాల ని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంట్రాక్టు, ఔట్సో ర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జి ల్లా కలెక్టర్కు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రా న్ని అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు భాస్క ర్తో కలిసి ధర్నా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 50 శాతానికి మించి పెంచకుండా 30 శాతం మాత్రమే పీఆర్సీని పెంచడం సరికాద న్నారు. రాష్ట్రంలో 87 లక్షలుగా ఉన్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ చిన్నచూపు చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 11వ పీఆర్సీలో ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలకు సంబంధించిన జీఓ 60లో పేర్కొన్న జీతాల పెంపుదల పట్ల ఉద్యోగుల అసంతృప్తిని పరిగణలోకి తీసుకొని జీవోను వెంటనే సవరించాలన్నారు. 2021 జూన్ 11న పీఆర్సీ జీవోలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఆ జీవోలో కనీస వేతనాలు 30 శాతంగా నిర్ణయించడం అన్యాయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 9వ పీఆర్సీకి 10వ పీఆర్సీకి మధ్య పెంపుదల సుమారు 50 శాతంగా ఉంటే, ప్రస్తుత పెంపుదల చాలా తక్కువగా ఉందన్నారు. ఈ మధ్య కాలంలో నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలు, విద్య, వైద్యం ఖర్చులు భారీగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ కాలంలో కుటుంబ ఖర్చులు కూడా రెట్టింపయ్యాయని చెప్పారు. పీఆర్సీ అమలులో కూడా మూడేండ్ల జాప్యం జరిగిందని చెప్పారు. 2021 మార్చిలో అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి పీఆర్సీ గురించి ప్రకటించినప్పటి నుంచి జీవోలు విడుదలవుతాయని ఎంతో ఆశగా ఎదురుచూసిన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జీవో 60 పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలోని 87లక్షల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు చేయడం, వివిధ సేవలందిస్తు న్న వీరి శ్రమను గుర్తించకపోవడం అన్యాయమన్నారు. వారి డిమాండ్లను పరిగణలోకి తీసుకుని జీవో 60ని సవరించాలన్నారు. 11వ పీఆర్సీ కమిషన్ చైర్మెన్ సిఫారసు చేసినట్లుగా 3 కేటగిరీలలో కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కనీస వేతనాలు రూ .19,000, రూ.22,900, రూ.31,040లుగా మార్పు చేస్తూ జీవోను సవరించాలన్నారు. పర్మినెంట్ ఉద్యోగులతో పాటు జూన్ నెల నుండే కొత్త వేతవాలు అమలుచేయాన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ఏజెన్సీల ద్వారా రిక్రూటయిన డైలీవేజ్ ఉద్యోగులు, వివిధ స్కీమ్లలో పని చేస్తున్న సిబ్బందితో సహా కొత్త పీఆర్సీని వర్తింపజేయాలన్నారు. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న సిబ్బందికి టీఏ, డీఏ, హెచ్ఆర్ వర్తింపజేయాలన్నారు. రెన్యూవల్ విధానం పేరుతో ప్రతి సంవత్సరం ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిం పును నిలిపివేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించా లని కోరారు. లేకుంటే దశల వారీగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, జిల్లా అధ్యక్షులు డి.జగదీష్, జిల్లా సహాయ కార్యదర్శి శేఖర్, జిల్లా నాయకులు ఎల్లయ్య, ఎల్మమ్మ, శ్రీరాములు, యాదమ్మ, సత్తయ్య ఉన్నారు.