Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాండూర్‌లో రూ.41.వేల విలువ గల విత్తనాలు స్వాధీనం
- సీఐ జలంధర్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు రూరల్
తాండూరు మండలం పర్వతాపూర్ గ్రామంలో నకిలీ విత్తనాల విక్రయిస్తున్నట్టు నమ్మదగిన సమాచారం మేరకు సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వ్యవసాయ అధికారి రజిత, ఎస్ఐ ఏడుకొండలు దాడు లు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి వద్ద 8 కిలోల నకిలీ పత్తి విత్త నాలు లభ్యమయ్యాయి. ఆయనను విచారించగా తాం డూరు పట్టణం కు చెందిన నరేష్ కుమార్ వద్ద తీసుకొ చ్చానని తెలిపారు. నరేష్ అనే వ్యక్తిని విచారణ చేయగా తాండూరు పట్టణం షావుకారుపేటలో గల ఒక రూంలో 18 కిలోల నకిలీ విత్తనాలు లభ్యమయ్యాయి. దీంతో ఇరువురిపై వ్యవసాయ అధికారి రజిత ఫిర్యాదు చేయ గా కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఐ జలంధర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నకిలీ విత్తనాలు విక్రయిస్తు న్న శ్రీనివాస్‌రెడ్డి, నరేష్కుమార్లను అదుపులోకి తీసు కున్నట్టు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాం డ్కు తరలిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎవరైనా నకిలీ విత్తనా లు అమ్మితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్ఐ ఏడుకొండలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.