Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో సీఎం కేసీఆర్‌తో ప్రారంభం
- హరితహారం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
- సమీకృత కార్యాలయ భవనాల పరిశీలన
- అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లాలో సమీకృత కలెక్టరేట్ నిర్మాణాలు పూర్తి అయినట్టు రాష్ట్ర విద్యాశాఖ మం త్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే సిద్ధిపేట, కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ప్రారంభిం చారని పేర్కొన్నారు. త్వరలోనే వికారాబాద్‌లో కూడా ప్రారంభిస్తారని తెలిపారు. సోమవారం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి భవనా లను పరిశీలించారు. అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన చేరువైందని అన్నారు. నూతన కలెక్టర్ కార్యాలయ సముదాయం వద్ద పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
హరితహారంపై మంత్రి వీసీ
ఏడో విడుత హరితహారం కార్యక్రమంపై వికారాబాద్ కలెక్టరేట్ నుంచి మంత్రి సబితాఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఆరు విడతల్లో తెలంగాణలో 210 కోట్ల మొక్కలు నాటారని తెలిపారు. ఏడో విడుతలో 19.86 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 40 లక్షల మొక్కలు నాటాలని సూచించారు. వికారాబాద్ జిల్లాగా ఏర్పడిన నాటి నుంచి 3 కోట్లపై చిలుకు మొక్కలు నాటినట్టు తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్‌రెడ్డి, కొప్పుల మహేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి , కలెక్టర్ పౌసుమీ బసు, రాష్ట్ర విద్యా మౌళిక సదుపాయాల సంస్థ చైర్మెన్ నాగేందర్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మురళీకృష్ణ, జడ్పీ వైస్ చైర్మెన్ విజరుకుమార్, అడిషనల్ కలెక్టర్లు చంద్రయ్య, మోతిలాల్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల పాల్గొన్నారు.