Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 77.50లక్షల నిధులతో శంకుస్థాపనలు
- పాల్గొన్న షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-కొత్తూరు
గ్రామీణాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాలలో కొత్తూరు జడ్పిటిసి ఎమ్మె శ్రీలత సత్యనారాయణతో కలిసి ఏనుగు మడుగు తాండ, ఇముల్ నర్వ, కోడిచెర్ల తండా, కోడిచెర్ల, కొత్తూరు తండా, మల్లాపూర్, మల్లాపూర్ తాండలలో అంగన్వాడి భవనం, డ్వాక్రా భవనం, సిసి రోడ్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. జిల్లా పరిషత్ నిధులు రూ. 53 లక్షలు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ. 24 లక్షల 50 వేల రూపాయల నిధులు మంజూరైనట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్లో అధిక నిధులు కేటాయించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని అన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపారు. నిరుపేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి ఎన్నో పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు మండల పరిషత్ అధ్యక్షులు పిన్నింటి మధుసూదన్ రెడ్డి, ఎంపీడీవో జ్యోతి, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, పెంట నోళ్ల యాదగిరి, దేవేందర్ యాదవ్, జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ గణేశ్, సర్పంచులు పాత్ల వత్ అరుణ రమేష్, అజరు నాయక్, సంతోష్ నాయక్, వెంకట్ రెడ్డి, చిర్ర సాయిలు, రవి నాయక్, బ్యాగరి సత్తయ్య, కట్నం రాజు, ఎంపిటిసి రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ శోభ లింగం నాయక్, కొత్తూరు మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య దేవేందర్ యాదవ్, వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్, పాత్లవత్ రవి నాయక్, మున్నూరు పద్మారావు, రమేష్ నాయక్, వడ్డె మహేష్, కమ్మరి జనార్ధన్ చారి, ఎస్టి సెల్ మండల అధ్యక్షుడు నేనావత్ గోపాల్ నాయక్, రాఘవేందర్ యాదవ్, సిటీ కేబుల్ వెంకటేష్, ఎమ్మె నర్సింహ, ఎమ్మె అజరు, బుడుగు ఆంజనేయులు, ఎమ్మే వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.