Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్రహీంపట్నం ఎంపీపీ కపేష్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కరోనా పరిస్థితులను అధిగమించేందుకు మహిళలు ముందు బాగాన నిలవాలని ఇబ్రహీంపట్నం ఎంపీపీ కపేష్ అన్నారు. మండల మహళా సమాఖ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోందన్నార్ను. వయసుతో నిమిత్తం లేకుండా ఈ మహమ్మారి బారిన పడి అనేక ప్రాణాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా మహమ్మారి కేసుల నమోదు తగ్గిందని గుర్తు చేశార్ను. అయినా ప్రజలు అజాగ్రత్తగా ఉండకూడదన్నారు. గుంపులు గుంపులుగా తిరగకుండా భౌతిక దూరం పాటించాలని గుర్తు చేశారు. అనుక్షణం మాస్కులు ధరించి కరోనాను కట్టడి చేయవచ్చని చెప్పారు. ఈ తరుణంలో మహిళా సంఘాల పాత్ర అమోఘంగా నిలవాలని చెప్పారు. అందుకని గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే సంఘ సమావేశాల్లోనూ కరోనా నివారణ అంశాలపై చర్చించారని చెప్పార్ను. గ్రామపంచాయతీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న కషికి మహిళలు సహకరించాలని కోరారు. శానిటేషన్, తడిి, పొడి చెత్త వేరు చేయడం వంటి కార్యక్రమాలకు సహకరించి గ్రామాభివద్ధికి ముందుకు తీసుకు వెళ్లాలన్నారు. అదేవిధంగా 30 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునే విధంగా విస్తత ప్రచారం చేయాలని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్ ఆధారంగా మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పార్ను. 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నార్ను. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ఏడో విడత హరితహారం కార్యక్రమం లో మన వంతు పాత్ర నిర్వర్తించాలని చెప్పారు. మహిళలు మహిళా సమాఖ్య ద్వారా తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. తీసుకున్న రుణాలను సైతం సకాలంలో చెల్లిస్తూ బ్యాంకులకు సహకరించాలన్నార్ను. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహేష్ బాబు, డీపీఎం బాలరాజు, స్వర్ణలత,ఏపిఎం రవీందర్, ఐకెపి క్లస్టర్ కోఆర్డినేటర్ల్ను, మహిళా సంఘాల ప్రతినిధులు ఉన్నారు.