Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ అశోక్ రెడ్డి
నవతెలంగాణ-దోమ
ఎస్సి కార్పొరేషన్ సబ్సిడీ యూనిట్లను ధరఖాస్తూ చేసుకొని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనీ సర్పంచ్ అశోక్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 300 పైచిలుకు పేద దళితులు దోమ మండలంలో ఆన్లైన్ దరఖాస్తు చేసుకుంటే కేవలం 20 లోపు ఎంపిక చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వం మాకు సాయం అందిస్తుందని,కొండంత అండతో దరఖాస్తు చేసుకుంటే లాటరీ పేరుతో కేవలం 5శాతం మందిని కూడా ఎంపిక చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దరఖాస్తు చేసుకొని అర్హత కలిగిన వారిని ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.