Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కందుకూరు
మండల పరిధిలోని కొత్తగూడ, దాసర్లపల్లి గ్రామా ల్లో శుక్రవారం గ్రామ సభలు నిర్వహిం చారు. ఈ సంద ర్భంగా కొత్తగూడ సర్పంచ్ సాదా మల్లారెడ్డి, దాసర్లపల్లి సర్పంచ్ పోలెమోని బాలమణి అశోక్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం గ్రామాల్లో జులై ఒకటో తారీకు నుంచి హరితహారం కార్యక్రమం నిర్వహించాల ని కోరారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాలుష్యాన్ని పారద్రో లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జ్యోతి, కొత్తగూడ గ్రామ ఉపసర్పంచ్ పద్మమ్మ, వార్డు సభ్యులు సునీత, సరిత, అజీజ్ ఖాన్, మహేందర్, జంగారెడ్డి, దామోదర్‌రెడ్డి, సుధాకర్ రెడ్డి, బసవరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి పంచాయతీ కార్యదర్శి శివశంకర్, దాసర్లపల్లి గ్రామ సభలో ఎంపీటీసీ ఇందిరా దేవేందర్, ఉప సర్పంచ్ మంగాదేవి, వార్డు సభ్యులు కృష్ణయ్య, యుగంధర్, శారద, రైస్, సరిత, వెంకటేష్, అనిత గ్రామస్తులు పాల్గొన్నారు.