Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మస్కు నరసింహ
- ఎంపీటీసీ భర్త వెంటనే క్షమాపణ చెప్పాలి
- ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపాలి
- ప్రభుత్వ పల్లెనిద్ర కార్యక్రమంలో సర్పంచ్‌పై దాడి చేయడం సిగ్గుచేటు
నవతెలంగాణ-యాచారం
బాధ్యతగల ఎంపీటీసీ భర్త మాల్ సర్పంచ్ పడకంటి కవితపై దాడి చేయడం హేమమైన చర్య అని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మస్కు నరసింహ అన్నారు. గురువారం రాత్రి యాచారం మండల పరిధిలోని మాల్ కేంద్రంలో ఎంపీడీవో, సర్పంచ్ పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా పాల్గొనడానికి వెళ్తుంటే ఎంపీటీసీ భర్త, ఆయన కుమారులు సర్పంచ్‌పై దాడి చేసి నాన్న బూతులు మాట్లాడి ఆమెను మానసికంగా హింసించడంపై కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. పీపుల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సర్పంచ్‌ని కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మాల్ కేంద్రంలో సర్పంచ్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆమెను వ్యక్తిగతంగా ఎంపీటీసీ భర్త టార్గెట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అధికారపక్షం ఎంపీటీసీ అయి ఉండి ప్రభుత్వం చేపట్టిన పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతున్న సర్పంచ్‌ను అడ్డగించి ఆమె మీద దాడి చేయడం అనేది ఓర్వలేనితనం అని విమర్శించారు. మాల్ కేంద్రంలో గతంలో సర్పంచ్‌గా పనిచేసిన ఎంపీటీసీ భర్త ఈ రకమైన దాడులకు పూనుకోవడం అనేది చాలా దురదృష్టకరంగా భావించాలని అన్నారు. ఓ మహిళా సర్పంచ్ మీద ఎంపీటీసీ భర్త, ఆయన కుమారులు దాడి చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని వారు తెలిపారు. ఆయన ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఎంపీటీసీ భర్త వెంటనే సర్పంచి కవితకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన ఎంపీటీసీ భర్త, ఆమె కుమారులను వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచులు రమేష్, నల్లవెల్లి ఎంపీటీసీ లక్ష్మీపతి గౌడ్, మంతన్ గౌరెల్లి ఎంపీటీసీ అరవింద్ నాయక్, నానక్ నగర్ మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు పాండురంగారెడ్డి, రామ్‌రెడ్డి, పడకంటి శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.