Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోడంగల్
కొడంగల్ మండలంలోని చిన్న నందిగామలో గురువారం ఎంపిఓ శ్రీనివాస్ పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెనిద్ర కార్యక్రమం గ్రామంలో ఉన్న సమస్యలను పరిశీలించి పరిష్కార మార్గాలు ఎంచుకోవడం కోసమే పల్లెనిద్ర అని పేర్కొన్నారు. ప్రధానంగా పారిశుధ్యం, హరితహారం, అంతర్గత రహదారులు, వంటి వాటిపై ప్రత్యేక దష్టి సారించడం జరుగు తుందన్నారు. అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లు వెంటనే పూర్తి చేయాలన్నారు. నర్సరీలలో ఉండే పిచ్చి మొక్కలు గడ్డి వంటి వాటిని ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కమ్యూనిటీ ప్లాంటేషన్ ఫిట్టింగ్ గుంతలను పరిశీలించారు. పల్లె ప్రకతి వనాన్ని పరిశీలించి మొక్కలు లేని దగ్గర కొత్త మొక్కలు నాటాలన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా మురుగు కాలువలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.