Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సింగపాగ జంగయ్య
నవతెలంగాన-ఫరూఖ్‌నగర్
దళిత మహిళ పద్మ భూమిలో బోరు వేసి భూమి దగ్గరికి రావద్దని భయపెడుతున్న మల్లేష్ యాదవ్‌పై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని టీఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సింగపాగ జంగయ్య అన్నారు. షాద్‌నగర్ పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగారెడ్డి , చటాన్ పల్లి గ్రామ శివారు లోని గల భూమి సర్వే నెంబర్ ఆర్ 287/79 లో గల భూమి యొక్క విస్తీర్ణం 2 రెండు ఎకరాల భూమిని లింగారెడ్డిగూడా గ్రామానికి చెందిన కాటా మల్లేష్ యాదవ్ తండ్రి రామయ్య యాదవ్ అనే వ్యక్తి గతవారం రోజుల నుండి దళిత మహిళ పద్మను భూమిలోకి రావద్దని వేధిస్తున్నారని అన్నారు. అట్టి భూమి పద్మ వాళ్ళ అత్తమ్మ కు 1968వ సంవత్సరంలో ప్రభుత్వ పరంగా అసైన్డ్ భూమి వ్యవసాయం సాగు చేసుకొని బతకడానికి మంజూరు చేసిందన్నారు. అందుకు సంబంధించిన భూమిలో అక్రమంగా దౌర్జన్యంగా వారికి ఎలాంటి సమాచారం లేకుండా కరోనా వ్యాధి లాక్ డౌన్ కారణంగా వారు భూమి వద్దకు వెళ్లకపోవడంతో కాటే మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి ఈ భూమి నాది అని అక్రమంగా వారికి సంబంధించిన భూమిని కొంతమంది రాజకీయ ప్రోద్బలంతో భూమిని దున్ని బోరు వేశరన్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కార్యక్రమంలో శ్రావణ్ కుమార్, చెవిటి జంగమ్మ , లక్ష్మయ్య , చెవిటి భారతమ్మ పాల్గొన్నారు.