Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ కొప్పు సుకన్య భాష
- పోషన్ అభియాన్ కవరేజ్ యాక్షన్ ప్లాన్ సమావేశం
నవతెలంగాణ-యాచారం
పోషక విలువలు ఉన్న పౌష్టికాహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు అందించాలని ఎంపీపీ కొప్పు సుకన్య భాష కోరారు. శుక్రవారం యాచారం మండల కార్యాలయంలో పోషన్ అభియాన్ కవరేజ్ యాక్షన్ ప్లాన్‌పై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి అందిస్తున్న పోషకాహారం నాణ్యంగా ఉండాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు, బాలింతలకు పోషక విలువలున్న ఆహారాన్ని అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా గర్భిణులు, బాలింతలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో అవగాహన కార్యక్రమాలు పెంచాలని ఆమె పేర్కొన్నారు. గ్రామాలలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకునే విధంగా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు పని చేయాలని ఆమె వెల్లడించారు. కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించే విధంగా ఉండాలని ఎంపీపీ తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగయ్య, ఎంఈవో, పంచాయతీ రాజ్ ఏఈ, సూపరిండెంట్ శైలజ, ఎంపీవో శ్రీలత, వైద్య అధికారులు పలువురు పాల్గొన్నారు.