Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షునిగా తాళ్ళ అఖిలేష్ గౌడ్‌ను నియమించారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, కో-ఆర్డినెటర్ ర్యాగఅరుణ్, యువజన విభాగం జాతీయ అధ్యక్షులు గడ్డం నర్సింహ ఆధ్వర్యంలో నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలేష్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని ఆందోళన వ్యక్తం చేశారు. తరతరాలుగా బీసీలు అణచివేతకు గురవుతున్నారని చెప్పారు. తనపై నమ్మకంతోఈ బాధ్యతలు అప్పగించిన జాతీయ,రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉద్యమాల నిర్మాణంలో తనవంతు పాత్ర నిర్వర్తిస్తానని చెప్పారు. అందుకు సహాకరించిన రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు నీలం వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొమ్మనమోని పవన్, రేనుకుంట్ల రఘువీర్, ధనం శరత్, హరి, సందీప్, వంశీ, శివ తదితరులు పాల్గొన్నారు.