Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
- రూ.3.41లక్షల చెక్కుల పంపిణీ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పేదలకు తమ ఆరోగ్యం కోసం చేసిన ఖర్చులకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శేరిగూడ గ్రామానికి చెందిన రాంరెడ్డికి రూ.60వేలు, యాదగిరికి రూ.60వేలు, శేఖర్గౌడ్కి రూ.60వేలు, ఇబ్రహీంపట్నానికి చెందిన బండి విజయనిర్మలకి రూ.60వేలు, నాగన్‌పల్లి గ్రామానికి చెందిన బాలయ్యకు రూ.50వేలు, తుర్కయంజాల్ మున్సిపాలిటీ మునగానూర్కు చెందిన ఉషకు రూ.51వేల చొప్పున సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మునుపెన్నడూ లేని విధంగా పేదలకు సీఎంఆర్ఎఫ్ను పేదలకు అందుబాటులోకి తెచ్చిందన్నారు. గతంలోపై ఇటు వైద్యఖర్చులే కాకుండా సీఎంఆర్ఎఫ్ కోసం కూడా పైరవీలు చేయాల్సి వచ్చేదన్నారు. కానీ వాటికి బిన్నంగా నేడు రాజకీయాలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ను అందజేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ కప్పరి స్రవంతిచందు, కౌన్సిలర్ జ్యోతి వెంకట్‌రెడ్డి తదితరులున్నారు.