Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ జగదీష్ నాయక్
నవతెలంగాణ-యాచారం
గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తాను పని చేస్తానని సర్పంచ్ జగదీష్ నాయక్ స్పష్టం చేశారు. శుక్రవారం యాచారం మండల పరిధిలోని తక్కల్లపల్లి తండా గ్రామ సభ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండాల అభివృద్ధికి మరిన్ని బాటలు వేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో తండాను మరింత అభివృద్ధి చేస్తానని పైన పేర్కొన్నారు. అర్హులైన వారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాలని జగదీష్ వెల్లడించారు. గ్రామ సభలో నెలకొన్న పలు సమస్యలపై పాలకవర్గం చర్చించడం జరిగిందని ఆయన చెప్పారు. తక్కల్లపల్లి తండాకు ఒక ఆశ వర్కర్ని ప్రభుత్వం కేటాయించాలని గతంలోనే కోరాడం జరిగిందని అన్నారు. అదేవిధంగా తండాలో ఖాళీగా ఉన్న ప్రాథమిక పాఠశాల భవనాలను గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఉపయోగపడేలా అధికారులు సహకరించాలని సర్పంచ్ జగదీష్ కోరారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తాము ఆదుకోవడానికి ముందుంటానని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ, మాజీ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు విజరు నాయక్, మండల వ్యవసాయ అధికారి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.