Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
లాక్డౌన్లో ఉపాధి కోల్పోయిన బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్టు ఎస్ఓఎస్ సంస్థ ప్రతినిధులు రవి ప్రకాష్, రాకేష్‌లు అన్నారు. మండల పరి ధిలోని గోపులారం, టంగటూరు, పొద్దుటూరు గ్రామాల్లో ఆదివారం ఎస్ఓఓస్ బాలల గ్రామం హైదరాబాద్ కుటుం బ బలోపేత కార్యక్రమం ద్వారా లాక్డౌన్ వలన ఉపాధి కోల్పోయిన 269 కుటుంబాలను గుర్తించి ఆయా కుటుం బాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్లో ఉపాధి కోల్పోయిన 269 కుటుంబాలను తమ సంస్థ గుర్తించినట్టు తెలిపారు. గోపులారం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్ఓఎస్ సంస్థ ఉపాధి కోల్పోయిన కుటుం బాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీ యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.