Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఎన్నికతో ఊరూరా
కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
నవతెలంగాణ- కొడంగల్
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి ఎంపిక కావడంతో కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఊరూరా టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నా రు. జై రేవంత్‌రెడ్డి అని నినాదాలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృష్ణంరాజు రేవంత్‌రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. పాలమూరు బిడ్డ, మల్కాజ్గిరి ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డికే టీపీసీసీ పీఠం దక్కింది. రెండున్నర సంవత్సరాలుగా ఈ పద వి కోసం కాంగ్రెస్ పార్టీలోని హేమాహేమీల మధ్య పోరు సాగినా చివరికి అధిష్టానం రేవంత్‌రెడ్డి వైపు మొగ్గు చూపింది. ఈ మేరకు రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవిని అప్పగిస్తూ, శనివారం అధిష్టానం ప్రకటన చేసిన ఈ విషయం అందరికీ తెలిసిందే. దీంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు సం బరాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు.
ప్రస్తుత నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి రేవంత్ స్వగ్రామం. హైదరాబాద్ ఏవీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. టీ ఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో పార్టీలో చేరి క్రియా శీలక రాజకీయాల్లోకి వచ్చారు. 2005 స్థానిక సం స్థల ఎన్నికల్లో మిడ్జిల్ జడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు, 2007 లో శాసనమండలి స్థానిక సంస్థల అభ్యర్థిగా ఇండి పెండెంట్గా పోటీ చేసి గెలుపొంది అందరి దృష్టిని ఆకర్షించారు. ఎమ్మెల్సీగా గెలిచాక టీడీపీలో చేరారు. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియో జకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి రెండు సార్లు వరుస విజయాలు సాధించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీడీపీ శాసన సభాపక్షం ఉప నాయకుడిగా, సభాపక్ష నాయకుడిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా కీలక బాధ్యతలు నిర్వహించారు. కేసులు, ఆరోపణల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ నినాదంతో తనతో పాటు పలువురు టీడీపీ నాయకులతో కలిసి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో కొడంగల్‌లో ఓడిపోయారు. 2019లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి, ఎంపీ గెలుపొంది లోక్ సభలో అడుగు పెట్టారు. మరోమారు టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో దీంతో రేవంత్‌రెడ్డి మరింత దూకుడు గా ముందుకు సాగే అవకాశం ఉందని కొడంగల్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీంతో కొడంగల్ కాంగ్రెస్ శ్రేణులు నయా జోష్‌తో ఉన్నారు.