Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కబ్జాకు పాల్పడ్డ వారిపై చర్యలు
జీవోకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు సీఐ బి. రాజు
నవతెలంగాణ- మొయినాబాద్
ప్రభుత్వ భూముల అక్రమిస్తే జైలుకే వెళ్తారని స్థానిక సీఐ బి.రాజు హెచ్చరించారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని చిలుకూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 277లోని ఎకరా ఆరు గుంటల ప్రభుత్వ భూమి సునీల్ కుమార్ ఆహుజా అక్రమించినట్టు తెలిపారు. సర్వే నెం 278లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సునీల్ కుమార్ భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టినందున ఐపీసీ సెక్షన్ ప్రకారం 188, 420, 447 క్రింద చిలుకూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. స్థానిక తహసీల్దార్ అనితను ఇట్టి సర్వే నెంబర్ విషయమై పూర్తి వివరణ కోరామని వారు ఇచ్చే నివేదిక ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసే ప్రయత్నం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములు, స్థలాలు కబ్జాదారుల ఆధీనంలో ఉన్నాయని వాటి వివరాలు సేకరించి రెవెన్యూ అధికారుల ఆదేశానుసారం కబ్జాకు పాల్పడిన వారిపై అందుకు సహకరించిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.