Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేశంపేట
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించడంతో కేశంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం సంబురాలు జరుపుకున్నారు. నాయకులంతా మండల కేంద్రంలో టపాకాయలు పేల్చి, స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జెండాలను చేతబట్టి రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయా గ్రామాల్లోని కార్యక్రమంలో నాయకులు జగదీశ్వర్, వీరేశం, రావుల పెంటయ్యముదిరాజ్, ఇబ్రహీం, ఆంజనేయులు, కర్ణాకర్ రెడ్డి, తైద పర్వతాలు, కోడూరు రాములు, శ్రీకాంత్ రెడ్డి, విజరురెడ్డి, శ్రీశైలం, శ్రీనివాసులు, బాల్ రాజ్, మల్లేష్, శివకుమార్, నర్సింలు, వెంకటేష్, కష్ణయ్య పాల్గొన్నారు.