Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి తంగలపల్లి జంగయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
కొన్నేండ్లుగా సాగు చేస్తున్న వారికే భూమిని ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి తంగలపల్లి జంగయ్య అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల పరిధిలోని దుద్దాగు గ్రామంలో సర్వే నెంబర్ 19 నుండి 54 వరకు జాగిర్దార్ భూములు సాగు చేస్తూ జీవిస్తున్న వారికి భూమిని అప్పజెప్పాలని దుద్దాగులో సీపీఐ(ఎం) పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ భూమిని సాగుచేస్తూ జీవిస్తున్న రైతులకు పూర్తిగా ఇచ్చి ఆదుకోవాలని తెలిపారు. దుద్దాగు గ్రామంలో 95 ఎకరాల భూమిని 55 మంది రైతులు సాగుచేస్తున్నారని చెప్పారు. వారిలో మొత్తం దళిత రైతులు మాత్రమే సాగు చేస్తూ కబ్జాలో ఉండి జీవిస్తున్నారని తెలిపారు. దళిత బిడ్డలకు జాగిర్దార్ భూమిని ప్రభుత్వం అప్పజెప్పి, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు స్పందించి దళిత రైతులు సాగు చేస్తున్న భూములను వెంటనే అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింహులు, జైపాల్, లక్ష్మి, పార్వతి, దేవేందర్ పాల్గొన్నారు.