Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌ను కోరిన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏ ర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల శాసన సభ్యులతో కలిసి వికారాబాద్ జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి వి నతిపత్రం సమర్పించారు. నూతనంగా ఏర్పడిన జిల్లానే కాకుండా, వికారాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతమని, పే ద ప్రజలకు సత్వర వైద్యం అందేందుకు వీలుగా ఆస్పత్రి తో కూడిన వైద్య కళాశాలను మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు. వెనుకబడిన ప్రాంతాల్లో వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచినందున వి కారాబాద్ జిల్లాను కూడా పరిగణలోకి తీసుకుని ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు. వికారాబాద్ జిల్లా ను గద్వాల జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్‌కు మార్చినందుకు జిల్లా శాసన సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటైతే రాష్ట్రంలో వైద్య సీట్లు పెరుగుతాయని, పేద వర్గాలకు మెరుగైన వైద్యం చేరువవుతుందని మంత్రి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే వైద్య పరంగా అనేక చర్యలు తీసుకున్నారని కళాశాలతో పూర్తి స్థాయి మెడికల్ హబ్‌గా మారుతుందన్నారు. ఇప్పటికే సరస్వతి నిలయంగా వెలుగొందుతున్న వికారాబాద్‌లో ప్రఖ్యాత అ నంతగిరి గాలికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ముఖ్య మంత్రిని కలిసిన వారిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మూసి రివర్ ఫ్రంట్ చైర్మెన్ సుధీర్‌రెడ్డి, శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, యాదయ్య, మహేష్‌రెడ్డి, మెతుకు ఆనంద్, రోహిత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, దాయనంద్ తదితరులు ఉన్నారు.