Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ఆదివారం ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ వాసులకు నెల్లూరు ఆనందయ్య కరోనా మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రజలందరికీ ఆనందయ్య మందు అందించేందుకు కషి చేస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా వారం రోజులుగా కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల, ఆమనగల్ మండలాల్లో అత్యధికంగా కేసులు నమోదైన గ్రామాల్లో అందరికీ ఆనందయ్య మందును అందజేస్తున్నారు. అదేవిధంగా మండలంలోని ఆకుతోటపల్లిలో కరోనా మందును ఆచారి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ భీమనపల్లి దుర్గయ్య, మాజీ జడ్పీటీసీ కండె హరిప్రసాద్, కౌన్సిలర్లు గోరటి జ్యోతి నర్సింహ, సుజాత రాములు, తల్లోజు విజరు కష్ణ, లక్ష్మణ్, కో-ఆప్షన్ సభ్యులు గజ్జె యాదమ్మ, పాషా, నాయకులు శీనయ్య, లక్ష్మణ్ రావు, మహేష్, శేఖర్, నరేందర్, తిరుపతి రెడ్డి, విజరు చందర్, కొండల్‌రెడ్డి, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.