Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా మాదాపూర్‌లోని హైటెక్స్, బాలానగర్‌లోని బొజారు ఫంక్షన్‌హాల్ ప్రాంగణంలో ఆదివారం టీచర్లకు వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో కలిసి మెడికవర్ ఆస్పత్రి వారు నిర్వహించారు. దాదాపు రెండు వేల మంది నగర టీచర్లకు ఉచితంగా టీకాలను అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. బాలింతల కోసం నర్సింగ్ స్టేషన్లు, ప్రతి హ్యాంగర్లోనూ ఓ అత్యవసర వార్డుతో పాటుగా ఐదు పడకలు ఏర్పాటు చేశారు. సెకండ్‌వేవ్ కారణంగా చాలామందిలో టీకా వేయించుకోవాలనే ఆలోచనలు పెరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా మెడికవర్ గ్రూప్ ఆస్పతి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికష్ణ మాట్లాడుతూ టీచర్లునూ ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్‌గా గుర్తించి, వారికి ఉచిత టీకా అందించారన్నారు. టీకా తీసుకోవడం వల్ల థర్డ్ వేవ్‌ను అడ్డుకునే అవకాశం ఉందన్నారు. ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కష్ణ యెదుల మాట్లాడుతూ ఈ ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రయివేటు టీచర్స్ ఫోరం ఫౌండర్, ప్రెసిడెంట్ షేక్ షబ్బీర్ అలీ, మెడికవర్ ఆస్పత్రి ప్రెసిడెంట్ నీరజ్ లాల్, క్లస్టర్ హెడ్ దుర్గేష్, మేఘ, తదితరులు పాల్గొన్నారు.