Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్‌కు కార్పొరేటర్ వినతి
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానామేట్ సర్వే నెంబర్ 44/14లోని ప్లాట్-17ను వేలం వేయాలనే నిర్ణయంపై పున:పరిశీలన చేయాలని కార్పొరేటర్ జగదీశ్వర్ కోరారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, స్థానికులతో కలిసి ఆదివారం మర్యాదపూర్వంగా కలిశాడు. ఇజత్‌నగర్ వీకర్ సెక్షన్ బస్తీలో నివాసం ఉంటున్న ప్రజలు బీసీ, ఎస్టీ, ఎస్టీలు ఎవరూ మతిచెందిన మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానామేట్ సర్వే నెంబర్ 44/14లోని స్థలంలోనే 30 ఏండ్లుగా అంత్యక్రియలు చేపడుతున్నారని మేయర్‌కు వివరించారు. గౌసియా అజామ్ దస్తగిర్ దర్గా స్థలాన్ని అభివద్ధి చేయాలని, ఇప్పటికే శ్మశానవాటిక అభివద్ధికి కషి చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని దష్టిలో పెట్టుకొని ప్రజలకు న్యాయం చేయాలని మేయర్‌కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బ్రహ్మయ్య యాదవ్, తైలి కష్ణ, రంగస్వామి, కేశవులు, శశిధర్, నర్సింగ్ నాయక్, సయ్యద షకీల్, ఎండీ అమీర్, రఫిక్, సిరాజ్ హుస్సేన్, నాయకురాలు సీతమ్మ, తదితరులు పాల్గొన్నారు.